రైల్వే ఉద్యోగాల కేసులో రబ్రీ దేవి, ఇద్దరు కుమార్తెలకు బెయిల్‌

బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, ఆమె ఇద్దరు కుమార్తెలు..మీసా భారతి, హేమా యాదవ్‌లకు దిల్లీలోని ప్రత్యేక కోర్టు బుధవారం రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసింది.

Published : 29 Feb 2024 05:06 IST

దిల్లీ: బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, ఆమె ఇద్దరు కుమార్తెలు..మీసా భారతి, హేమా యాదవ్‌లకు దిల్లీలోని ప్రత్యేక కోర్టు బుధవారం రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసింది. ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో స్థలాలను లంచంగా ఇచ్చిన అభ్యర్థులకు రైల్వే ఉద్యోగాలను కట్టబెట్టారనే కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌(ఈడీ) లాలూ, ఆయన కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేసింది. ఈ నెల 9న రబ్రీ దేవి, ఆమె ఇద్దరు కుమార్తెలకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన ప్రత్యేక కోర్టు బుధవారం రెగ్యులర్‌ బెయిల్‌ ఇచ్చింది. వీరికి బెయిల్‌ను ఈడీ వ్యతిరేకించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని