నేరుగా ఇంటికే అయోధ్య హనుమాన్‌ ప్రసాదం

అయోధ్యలో ఉన్న హనుమాన్‌గఢీ ఆలయ ప్రసాదం ఇక నేరుగా భక్తుల ఇళ్లకు చేరనుంది. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ తర్వాత అయోధ్యలో భక్తుల రద్దీ లక్షల సంఖ్యలో పెరిగింది.

Updated : 29 Feb 2024 09:29 IST

ఈటీవీ భారత్‌: అయోధ్యలో ఉన్న హనుమాన్‌గఢీ ఆలయ ప్రసాదం ఇక నేరుగా భక్తుల ఇళ్లకు చేరనుంది. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ తర్వాత అయోధ్యలో భక్తుల రద్దీ లక్షల సంఖ్యలో పెరిగింది. దీంతో చాలామంది భక్తులకు హనుమాన్‌గఢీ ఆలయ దర్శనం సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో భారతీయ తపాలాశాఖ హనుమాన్‌ గఢీ ఆలయ ప్రసాదాన్ని పోస్టల్‌ శాఖ ద్వారా ఇళ్లకు పంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.  ప్రసాదం కోసం దగ్గరలో ఉన్న పోస్టాఫీసుకు వెళ్లి.. ‘డిప్యూటీ పోస్ట్‌మాస్టర్‌, అయోధ్య ధామ్‌ -224123’ చిరునామాతో ఈ-మనీ ఆర్డర్‌ తీయాలి. భక్తుల చిరునామా ఇచ్చిఆర్డర్‌ చేయాలి. పిన్‌కోడ్‌, ఫోన్‌ నంబరు తప్పనిసరి. ఇలా ఆర్డర్‌ చేశాక స్పీడ్‌పోస్టు ద్వారా ప్రసాదాన్ని ఇంటికే పంపుతామని ప్రయాగ్‌రాజ్‌, వారణాసి జోన్‌ పోస్ట్‌మాస్టర్‌ కృష్ణకుమార్‌ తెలిపారు. రూ.251 మనీఆర్డర్‌కు లడ్డూలు, హనుమాన్‌ చిత్రం, మహావీర్‌ గంధం, అయోధ్య దర్శన పుస్తకం పంపుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని