సముద్రజీవికి రాష్ట్రపతి పేరు

ఒడిశా-పశ్చిమబెంగాల్‌ సరిహద్దుల్లోని బంగాళాఖాతంలో కనిపించిన ఒక కొత్త రకం జీవికి జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జడ్‌ఎస్‌ఐ) శాస్త్రవేత్తలు రాష్ట్రపతి పేరు పెట్టారు.

Published : 01 Mar 2024 03:35 IST

బెర్హంపుర్‌: ఒడిశా-పశ్చిమబెంగాల్‌ సరిహద్దుల్లోని బంగాళాఖాతంలో కనిపించిన ఒక కొత్త రకం జీవికి జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జడ్‌ఎస్‌ఐ) శాస్త్రవేత్తలు రాష్ట్రపతి పేరు పెట్టారు. ఇది హెడ్‌ షీల్డ్‌ సీ స్లగ్‌ అనే తరహా జీవి. ఉదయ్‌పుర్‌, డిఘా తీరంలో ఈ జీవి కనిపించిందని, దీనికి ‘మెలనోక్లమిస్‌ ద్రౌపది’ అనే పేరు పెట్టామని జడ్‌ఎస్‌ఐ సంచాలకురాలు ధృతి బెనర్జీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని