అస్సాంలో సీఏఏ అమలును అడ్డుకోండి

అస్సాంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలును అడ్డుకోవాలంటూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ప్రతిపక్షాలు కోరాయి.

Published : 01 Mar 2024 04:32 IST

రాష్ట్రపతిని కోరిన ప్రతిపక్షాలు

గువాహటి: అస్సాంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలును అడ్డుకోవాలంటూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ప్రతిపక్షాలు కోరాయి. ఈ మేరకు గవర్నర్‌ గులాబ్‌ చంద్‌ కటారియా ద్వారా వినతి పత్రాన్ని పంపించాయి. తమ డిమాండ్‌ నెరవేరకుంటే రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తామని నొక్కిచెప్పాయి. రాష్ట్రంలో సీఏఏను అమలు చేసిన మరుసటి రోజే బంద్‌ ప్రకటిస్తామని ‘ఇండియా’ కూటమి సారథ్యంలో ఏర్పడిన ‘అస్సాం ఐక్య విపక్ష వేదిక (యూఓఎఫ్‌ఏ)’ ప్రకటించింది.

బంద్‌ నష్టాన్ని నిర్వాహకుల నుంచే: డీజీపీ

అస్సాంలో బంద్‌ వల్ల రాష్ట్రానికి రోజుకు రూ.1,643 కోట్ల నష్టం సంభవిస్తుందని, ఆ మొత్తాన్ని బంద్‌ నిర్వాహకుల నుంచే వసూలు చేస్తామని డీజీపీ జ్ఞానేంద్ర ప్రతాప్‌ సింగ్‌ తేల్చి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని