భార్య ఆత్మహత్యకు భర్తే కారణమని చెప్పలేం

భార్య ఆత్మహత్య కేసులో సరైన సాక్ష్యం లేకపోతే భర్తను దోషిగా నిర్ధారించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. మూడు దశాబ్దాల నాటి కేసులో ఓ వ్యక్తిని నిర్దోషిగా పేర్కొంటూ తీర్పు వెలువరించింది.

Published : 01 Mar 2024 05:38 IST

‘113ఎ’ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి: సుప్రీం

దిల్లీ: భార్య ఆత్మహత్య కేసులో సరైన సాక్ష్యం లేకపోతే భర్తను దోషిగా నిర్ధారించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. మూడు దశాబ్దాల నాటి కేసులో ఓ వ్యక్తిని నిర్దోషిగా పేర్కొంటూ తీర్పు వెలువరించింది. ఈ కేసులో భర్తకు భారతీయ సాక్ష్య చట్టంలోని సెక్షన్‌ 113ఎ వర్తించదని పేర్కొంది. పెళ్లైన ఏడేళ్లలోపు మహిళ ఆత్మహత్యకు పాల్పడితే అందుకు భర్త, అతని బంధువులే ప్రేరేపించారన్న ఊహను సెక్షన్‌ 113ఎ నిర్ధారిస్తుంది. కేవలం వేధింపులే ఆత్మహత్యకు ప్రేరణ అయ్యాయని భావించలేమని జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్ర ధర్మాసనం తన తీర్పులో తెలిపింది. ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితుల్లో నిందితుడు ప్రత్యక్ష చర్య ఉందా లేదా అన్నది కూడా కీలకమని పేర్కొంది. ‘‘పెళ్లై ఏడేళ్లలోపే ఆత్మహత్య జరిగింది కాబట్టి అందుకు నిందితుడే కారణమని చెప్పలేం. క్రూరత్వం జరిగిందని నిరూపించాలి. ఇందుకు సరైన సాక్ష్యం లేకుండా సెక్షన్‌ 113ఎ ప్రకారం నిందితుడిని దోషిగా భావించలేం’’ అని ధర్మాసనం పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని