జయప్రద పిటిషన్‌ కొట్టివేత

ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసుల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని రామ్‌పుర్‌ ట్రయల్‌ కోర్టు తనపై జారీచేసిన నాన్‌ బెయిలబుల్‌ వారెంటును నిలిపివేయాలని కోరుతూ మాజీ ఎంపీ, సినీనటి జయప్రద దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్‌ హైకోర్టు గురువారం కొట్టివేసింది.

Published : 01 Mar 2024 04:33 IST

ప్రయాగ్‌రాజ్‌ (యూపీ): ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసుల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని రామ్‌పుర్‌ ట్రయల్‌ కోర్టు తనపై జారీచేసిన నాన్‌ బెయిలబుల్‌ వారెంటును నిలిపివేయాలని కోరుతూ మాజీ ఎంపీ, సినీనటి జయప్రద దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్‌ హైకోర్టు గురువారం కొట్టివేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా తనపై దాఖలైన ఈ కేసుల విచారణకు జయప్రద పదే పదే గైర్హాజరు కావడంతో.. ఆమెను పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించిన రామ్‌పుర్‌ ట్రయల్‌ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంటు జారీ చేసింది. మార్చి 6వ తేదీలోపు జయప్రదను అరెస్టు చేయాలని ఆదేశించింది. ఈ వారెంటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. మరిన్ని వాస్తవాలు, ఆధారాలతో తాము తాజా పిటిషను దాఖలు చేస్తామని జయప్రద తరఫు న్యాయవాది అనుమతి కోరగా, న్యాయమూర్తి అంగీకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని