నోటీసు ఇవ్వకుండానే కూల్చేశారు

అధికారులు ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే తన ఇంటిని బుల్‌డోజర్లతో కూల్చివేశారని వకీల్‌ హసన్‌ ఆరోపించారు. ఉత్తరకాశీలోని సిల్‌క్యారా సొరంగంలో గతేడాది చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను రక్షించిన ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌ నిపుణుల్లో వకీల్‌ హసన్‌ ఒకరు.

Published : 01 Mar 2024 04:34 IST

సిల్‌క్యారా సొరంగ హీరో వకీల్‌ హసన్‌

దిల్లీ: అధికారులు ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే తన ఇంటిని బుల్‌డోజర్లతో కూల్చివేశారని వకీల్‌ హసన్‌ ఆరోపించారు. ఉత్తరకాశీలోని సిల్‌క్యారా సొరంగంలో గతేడాది చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను రక్షించిన ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌ నిపుణుల్లో వకీల్‌ హసన్‌ ఒకరు. బుధవారం దేశరాజధానిలోని ఖజూరీ ఖాస్‌ ప్రాంతంలో అక్రమణల తొలగింపులో భాగంగా దిల్లీ అభివృద్ధి ప్రాధికార సంస్థ (డీడీఏ) అధికారులు హసన్‌ ఇంటిని కూల్చివేశారు. దీనిపై డీడీఏ వివరణ ఇచ్చింది. అక్రమ నిర్మాణాలను మాత్రమే తాము కూల్చామని పేర్కొంది. ఆ నిర్మాణాల్లో వకీల్‌ హసన్‌ నివాసం ఉందని తమకు తెలియదని పేర్కొంది. సిల్‌క్యారా ఆపరేషన్‌లో అతని పాత్ర తెలియగానే స్పందించామని నరేలాలో ఈడబ్ల్యూఎస్‌ ఫ్లాట్‌ కేటాయిస్తామని ప్రతిపాదించామని.. అందుకు వకీల్‌ తిరస్కరించారని పేర్కొంది. కూల్చిన ప్రాంతంలోనే తన ఇంటిని నిర్మించాలని, లేకపోతే నిరాహార దీక్ష చేస్తానని హసన్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని