రోడ్డు ప్రమాదంలో ఇంటెల్‌ ఇండియా మాజీ హెడ్‌ అవతార్‌ సైనీ మృతి

ప్రముఖ టెక్‌ కంపెనీ ఇంటెల్‌ ఇండియా మాజీ హెడ్‌ అవతార్‌ సైనీ(68) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

Published : 01 Mar 2024 04:34 IST

సైక్లింగ్‌ చేస్తుండగా ఢీకొట్టిన క్యాబ్‌

ముంబయి: ప్రముఖ టెక్‌ కంపెనీ ఇంటెల్‌ ఇండియా మాజీ హెడ్‌ అవతార్‌ సైనీ(68) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. నవీ ముంబయి టౌన్‌షిప్‌లో బుధవారం ఉదయం సైక్లింగ్‌ చేస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ క్యాబ్‌ ఆయన్ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ ఆయన్ను తోటి సైక్లిస్టులు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. క్యాబ్‌ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని