ప్రభుత్వ పదవుల్లోకి 25 మంది ప్రైవేటు నిపుణులు

ప్రైవేటు రంగానికి చెందిన 25 మంది నిపుణులు త్వరలో వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో చేరబోతున్నారు. వీరిలో ముగ్గురు సంయుక్త కార్యదర్శులుగా, 22 మంది డైరెక్టర్లుగా, ఉప కార్యదర్శులుగా చేరతారు.

Published : 02 Mar 2024 04:21 IST

దిల్లీ: ప్రైవేటు రంగానికి చెందిన 25 మంది నిపుణులు త్వరలో వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో చేరబోతున్నారు. వీరిలో ముగ్గురు సంయుక్త కార్యదర్శులుగా, 22 మంది డైరెక్టర్లుగా, ఉప కార్యదర్శులుగా చేరతారు. వీరు ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ నియామకాల కమిటీ వీరి చేరికకు ఆమోద ముద్ర వేసింది. సాధారణంగా సంయుక్త, ఉప కార్యదర్శులు, డైరెక్టర్ల పదవుల్లో ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటి అఖిల భారత సర్వీసుల వారిని నియమిస్తారు. గ్రూపు ఏ అధికారులనూ తీసుకుంటారు. 2018 నుంచి ప్రైవేటు రంగం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, స్వయంప్రతిపత్తిగల సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఎంపిక చేసే పద్ధతి చేపట్టారు. ఇలా ఎంపికైనవారు మూడేళ్లపాటు పదవిలో ఉంటారు.  ప్రభుత్వంలోకి వివిధ రంగాల ప్రతిభావంతులను తీసుకోవడమే ఈ పథకం ఉద్దేశం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని