85 ఏళ్లు నిండిన వారికే పోస్టల్‌ బ్యాలెట్‌

ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం వినియోగించుకోవడానికి ఇదివరకున్న 80 ఏళ్ల అర్హతను కేంద్ర ప్రభుత్వం 85 ఏళ్లకు పెంచింది.

Published : 02 Mar 2024 04:26 IST

ఎన్నికల నిర్వహణ నిబంధనల్లో సవరణ

ఈనాడు, దిల్లీ: ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం వినియోగించుకోవడానికి ఇదివరకున్న 80 ఏళ్ల అర్హతను కేంద్ర ప్రభుత్వం 85 ఏళ్లకు పెంచింది. ఈమేరకు ఎన్నికల నిబంధనలు 1961లోని రూల్‌ 27ఎ క్లాజ్‌ (ఇ)ని సవరిస్తూ కేంద్ర న్యాయశాఖ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఇదివరకు 80 ఏళ్లు నిండిన వయోవృద్ధులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఇంటి వద్దే ఓటు వేయడానికి వీలుండేది. ఇకపై 85 ఏళ్ల పైబడిన వారికే ఈ సౌకర్యం వర్తించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని