మానవుడి మెదడు అంతుచిక్కనిది

మానవుడి మెదడు అంతుచిక్కనిదని, ఓ పురుషుడు లేదా మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయని సుప్రీంకోర్టు పేర్కొంది.

Published : 02 Mar 2024 05:09 IST

ఆత్మహత్యకు ఎన్నో కారణాలు ఉంటాయి: సుప్రీంకోర్టు

దిల్లీ: మానవుడి మెదడు అంతుచిక్కనిదని, ఓ పురుషుడు లేదా మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయని సుప్రీంకోర్టు పేర్కొంది. తాను అద్దెకు ఉంటున్న ఇంటి యజమానురాలిని ఆత్మహత్య చేసుకొనేలా ప్రేరేపించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని నిర్దోషిగా విడుదల చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘ఆత్మహత్యలకు ఎన్నో కారణాలు ఉంటాయి. చదువులో మంచి మార్కులు సాధించలేకపోవడం, హాస్టల్‌/ కళాశాలలో నిరాశాజనకమైన వాతావరణం, నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు, ప్రేమలో వైఫల్యం, ఒత్తిడి.. ఇలా అనేక పరిస్థితులు దోహదం చేస్తాయి’’ అని జస్టిస్‌ బేలా ఎం. త్రివేది, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో 24 ఏళ్ల క్రితం నిందితుడు.. తాను అద్దెకు ఉన్న ఇంటి యజమానురాలికి పెళ్లి ప్రతిపాదన చేశాడు. అంగీకరించకపోతే.. ఆమె సోదరీమణుల కుటుంబాలను నాశనం చేస్తానని బెదిరించాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన తోబుట్టువులకు ఫోన్‌లో చెప్పి విషం తాగి చనిపోయింది. అయితే సర్వోన్నత న్యాయస్థానం.. ఈ కథనం ఆధారంగా నిందితుడు.. ఆత్మహత్యకు ప్రేరేపించాడని అనలేమని పేర్కొంది. చిన్న వయసులో ఆమె చనిపోవడం విషాదకరమైనా సెక్షన్‌ 306 కింద సాక్ష్యాలను చూపించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమెంiదని ధర్మాసనం పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని