హిమాచల్‌లో ఆరని సెగలు

హిమాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. తమతో మరో 9 మంది ఎమ్మెల్యేలు సంప్రదింపుల్లో ఉన్నారంటూ తిరుగుబాటు వర్గ ఎమ్మెల్యే రాజీందర్‌ రాణా చెబుతున్నారు.

Published : 03 Mar 2024 03:26 IST

తిరుగుబాటు వర్గంవైపు మరో 9 మంది ఎమ్మెల్యేలు!

శిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. తమతో మరో 9 మంది ఎమ్మెల్యేలు సంప్రదింపుల్లో ఉన్నారంటూ తిరుగుబాటు వర్గ ఎమ్మెల్యే రాజీందర్‌ రాణా చెబుతున్నారు. ముఖ్యమంత్రి సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు పాలనలో వారంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని పీటీఐ వార్తాసంస్థ ముఖాముఖిలో ఆయన చెప్పారు. ‘‘సుఖు స్నేహితులు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మంత్రులు, ఎన్నికైన ప్రజాప్రతినిధులకు తగిన గౌరవం లభించడం లేదు. రాష్ట్రానికి చెందిన ఎంతోమంది నేతలు ఉండగా, బయటినుంచి వచ్చిన అభిషేక్‌ మను సింఘ్విని ఎన్నికల్లో నిలబెట్టడంతో మేం కలత చెందాం. హిమాచల్‌ ప్రయోజనాల కోసమే క్రాస్‌ఓటింగ్‌ చేశాం’’ అని వెల్లడించారు. ముఖ్యమంత్రి ‘నంబర్‌ వన్‌ అబద్ధాల కోరు’ అని ఆరోపించారు.

కేబినెట్‌ భేటీ నుంచి బయటకు మంత్రులు

శనివారం శిమ్లాలో జరిగిన మంత్రివర్గ సమావేశం నుంచి ఇద్దరు మంత్రులు- జగత్‌ నేగి, రోహిత్‌ ఠాకుర్‌ అర్థంతరంగా బయటకు రావడం మరో హైడ్రామాకు తెరతీసింది. విధాన నిర్ణయాలపై వేడివేడి చర్చల అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది. బుజ్జగింపుల తర్వాత ఠాకుర్‌ మళ్లీ సమావేశానికి వెళ్లారు. కేబినెట్‌ సమావేశం గంటన్నర ఆలస్యంగా మొదలు కావడం, తనకు వేరే పని ఉండడంతో మధ్యలోనే వెళ్లిపోయినట్లు నేగి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని