అమృత్‌ భారత్‌ రైళ్లలో వెయ్యి కి.మీ.కు రూ.454 టికెట్‌

అమృత్‌ భారత్‌ రైలులో 1,000 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.454 మాత్రమే ఖర్చవుతుందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ శనివారం చెప్పారు.

Published : 03 Mar 2024 04:16 IST

రాబోయే కాలంలో వెయ్యి రైళ్లు: వైష్ణవ్‌

దిల్లీ: అమృత్‌ భారత్‌ రైలులో 1,000 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.454 మాత్రమే ఖర్చవుతుందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ శనివారం చెప్పారు. ఇప్పటికే ప్రతి వ్యక్తికి 55% రాయితీ లభిస్తోందని, నవతరం రైళ్లు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. రానున్న సంవత్సరాలలో కనీసం 1,000 అమృత్‌ భారత్‌ రైళ్లను తయారు చేయించనున్నట్లు తెలిపారు. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో పరుగుతీసే రైళ్లను సిద్ధం చేయడానికీ సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. రాబోయే అయిదేళ్లలో మొదటి వందేభారత్‌ రైలును విదేశాలకు ఎగుమతి చేయనున్నట్లు పీటీఐ-వీడియోస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. దేశంలో వారానికి ఒకటి చొప్పున వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను ప్రవేశపెడుతున్నామనీ, మరి కొన్నేళ్లలో 400 నుంచి 500 రైళ్లు పట్టాలకెక్కుతాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని