త్రిపురలో తెగల సమస్యల పరిష్కారానికి త్రైపాక్షిక ఒప్పందం

త్రిపురలో వివిధ తెగల మధ్య ఉన్న విభేదాల పరిష్కారానికి టిప్రా మోథా, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది.

Published : 03 Mar 2024 04:17 IST

అమిత్‌ షా సమక్షంలో ఖరారు

దిల్లీ: త్రిపురలో వివిధ తెగల మధ్య ఉన్న విభేదాల పరిష్కారానికి టిప్రా మోథా, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమక్షంలో శనివారం ఇక్కడ ఈ కార్యక్రమం జరిగింది. తాజా ఒప్పందంపై సంతకం ద్వారా ప్రభుత్వం చరిత్రను గౌరవించిందని, గతంలో జరిగిన తప్పులను సరిదిద్దిందని, ప్రస్తుత వాస్తవాన్ని ఆమోదించిందని అమిత్‌ షా ఈ సందర్భంగా తెలిపారు. ‘‘మీ హక్కుల కోసం మీరు ఎంతమాత్రం పోరాడాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇందుకు అవసరమైన చర్యలను తీసుకుంటుంది’’ అని పేర్కొన్నారు. ఈ ఒప్పందం కింద స్థానిక తెగల మధ్య చరిత్ర, నేల, రాజకీయ హక్కులు, ఆర్థిక వృద్ధి, గుర్తింపు సంస్కృతి, భాషకు సంబంధించి నెలకొన్న అన్ని వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు అంగీకారం కుదిరింది. దీనిపై ఒక సంయుక్త కార్యాచరణ కమిటీ కూడా ఏర్పాటవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని