నౌకాదళంలో చేరనున్న సీహాక్‌ హెలికాప్టర్‌

సముద్ర జలాల్లో దాగి ఉన్న శత్రు జలాంతర్గాములు, రాడార్లను నాశనం చేసేందుకు శక్తిమంతమైన అస్త్రంతో భారత నౌకాదళం సిద్ధమవుతోంది.

Published : 03 Mar 2024 04:18 IST

దిల్లీ: సముద్ర జలాల్లో దాగి ఉన్న శత్రు జలాంతర్గాములు, రాడార్లను నాశనం చేసేందుకు శక్తిమంతమైన అస్త్రంతో భారత నౌకాదళం సిద్ధమవుతోంది. ఇందుకోసం ఎంహెచ్‌ 60ఆర్‌ సీహాక్‌ అనే ఈ హెలికాప్టర్‌ను తన అమ్ములపొదిలో చేర్చుకోనుంది. కొచ్చిలోని ఐఎన్‌ఎస్‌ గరుడలో ఈ లోహవిహంగానికి  సంబంధించిన పరీక్షలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి.

సీహాక్‌ హెలికాప్టర్‌లో 38 లేజర్‌-గైడెడ్‌ రాకెట్‌లు, నాలుగు ఎంకే54 టోర్పిడోలు, మెషీన్‌ గన్‌లు.. శత్రువులను నాశనం చేసేందుకు ఉపయోగపడతాయి. హెలికాప్టర్‌ ముందు భాగంలోని ఫార్వర్డ్‌-లుకింగ్‌ ఇన్‌ఫ్రారెడ్‌ సెన్సర్లు ఎదురుగా ఉన్న జలాంతర్గామి లేదా క్షిపణికి సంబంధించిన కచ్చితమైన చిత్రాన్ని ఆవిష్కరించగలవు. ఈ లోహవిహంగం.. ఒక ప్రాంతాన్ని స్కాన్‌ చేయగలదు. క్షిపణి దాడులపై హెచ్చరికలు చేస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని