ఓటర్ల వివేకాన్ని తక్కువగా అంచనా వేయొద్దు

దేశ ప్రతిష్ఠకు, విశ్వసనీయతకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసినందుకుగాను ప్రముఖ రాజకీయ నేతలైన రాహుల్‌గాంధీ, అరవింద్‌ కేజ్రీవాల్‌, అఖిలేశ్‌ యాదవ్‌లపై చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను బుధవారం దిల్లీ హైకోర్టు విచారణకు తిరస్కరించింది.

Published : 21 Mar 2024 04:26 IST

దిల్లీ హైకోర్టు వ్యాఖ్య

దిల్లీ: దేశ ప్రతిష్ఠకు, విశ్వసనీయతకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసినందుకుగాను ప్రముఖ రాజకీయ నేతలైన రాహుల్‌గాంధీ, అరవింద్‌ కేజ్రీవాల్‌, అఖిలేశ్‌ యాదవ్‌లపై చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను బుధవారం దిల్లీ హైకోర్టు విచారణకు తిరస్కరించింది. తమను ఎవరు సరైన మార్గంలో నడిపిస్తారు.. ఎవరు తప్పుదోవ పట్టిస్తారనేది భారతీయ ఓటర్లకు తెలుసని, వారి వివేకాన్ని తక్కువగా అంచనా వేయొద్దని ఈ సందర్భంగా పిటిషనరును ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. పారిశ్రామికవేత్తల రుణమాఫీ గురించి పై ముగ్గురు నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేశారంటూ పత్రికలు, న్యూస్‌ ఛానళ్లు, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కథనాల ఆధారంగా సూర్జిత్‌సింగ్‌ యాదవ్‌ అనే వ్యక్తి ఈ పిటిషను దాఖలు చేశారు. ‘‘పారిశ్రామికవేత్తలు లేదా రాజకీయ నాయకులు బాధితులు ఎవరైతే వారు చర్య తీసుకుంటారు. ఇందులోకి మమ్మల్ని లాగకండి. ప్రజలు చాలా తెలివైనవారు’’ అని తాత్కాలిక సీజే జస్టిస్‌ మన్మోహన్‌, జస్టిస్‌ మన్‌మీత్‌ పి.ఎస్‌.అరోడా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని