కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కుమార్తె వీణా విజయన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేసింది.

Updated : 28 Mar 2024 06:50 IST

విచారణకు త్వరలో సమన్లు

కొచ్చిన్‌: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కుమార్తె వీణా విజయన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేసింది. వీణ నిర్వహిస్తున్న ఐటీ సంస్థకు ఓ ప్రైవేటు కంపెనీ అక్రమంగా చెల్లింపులు చేసిందనే ఆరోపణలతో ఈ కేసు నమోదైనట్లు ఈడీ అధికారులు బుధవారం వెల్లడించారు. దీనిపై విచారణకు వీణాతోపాటు మరికొందరికి త్వరలో సమన్లు జారీ చేయనున్నారు. కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ కార్యాలయం (ఎస్‌ఎఫ్‌ఐవో) ఇటీవల దాఖలు చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొని వీణ సంస్థపై, మరికొందరిపై పీఎంఎల్‌ఏ కేసును ఈడీ నమోదు చేసింది. కొచ్చిన్‌ మినరల్స్‌ అండ్‌ రూటైల్‌ లిమిటెడ్‌ అనే సంస్థ వీణాకు చెందిన ఎక్సాలాజిక్‌ సొల్యూషన్స్‌ కంపెనీకి 2018-19 మధ్య అక్రమంగా రూ.1.72 కోట్ల చెల్లింపులు చేసినట్టు ఆదాయపన్ను శాఖ గుర్తించింది. కొచ్చిన్‌ మినరల్స్‌కు ఎక్సాలాజిక్‌ ఎలాంటి సేవలు అందించకుండానే ఈ చెల్లింపులు జరిగినట్లు ఐటీ శాఖ పేర్కొంది. దీంతో ఎక్సాలాజిక్‌పై ఎస్‌ఎఫ్‌ఐవో విచారణ జరిపి అక్రమంగా చెల్లింపులు జరిగినట్లు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని