‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో

చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్‌వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం రెక్కలను దర్భంగా (బిహార్‌)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్‌క్రాఫ్ట్‌ ఢీకొంది.

Updated : 28 Mar 2024 05:50 IST

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో ఘటన

కోల్‌కతా: చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్‌వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం రెక్కలను దర్భంగా (బిహార్‌)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్‌క్రాఫ్ట్‌ ఢీకొంది. కోల్‌కతా విమానాశ్రయంలోని ట్యాక్సీ వేపై బుధవారం ఉదయం 11.00 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో రెండు విమానాల రెక్కలు బాగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై విచారణ ప్రారంభించిన పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌  (డీజీసీఏ) ఈ ఘటనకు బాధ్యులైన ఇండిగో పైలట్లు ఇద్దరినీ తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రమాద సమయంలో రెండు విమానాల్లో కలిపి మొత్తం 298 మంది  ప్రయాణికులు ఉన్నారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ప్రమాదం అనంతరం రెండు విమానాలు తమ తమ స్థావరాలకు వెనక్కు వెళ్లగా..ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని