ఆసుపత్రి నుంచి సద్గురు డిశ్ఛార్జ్‌

ఈశా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్‌ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

Published : 28 Mar 2024 04:37 IST

దిల్లీ: ఈశా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్‌ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్‌ ఓ ప్రకటనలో తెలిపింది. తీవ్ర తలనొప్పితో బాధపడుతున్న ఆయన ఈ నెల 17న దిల్లీలోని అపోలో ఆసుపత్రిలో బ్రెయిన్‌ సర్జరీ చేయించుకున్నారు. సద్గురు పూర్తిగా కోలుకున్నారని అపోలో ఆసుపత్రి గ్రూప్‌ డైరెక్టర్‌ సంగీతారెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని