మనీలాండరింగ్‌ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం

ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్‌ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్‌ 120బి’ని మోపి పీఎంఎల్‌ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది.

Published : 28 Mar 2024 04:38 IST

 రివ్యూ పిటిషన్‌ కొట్టివేస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్య

దిల్లీ: ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్‌ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్‌ 120బి’ని మోపి పీఎంఎల్‌ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. గత ఏడాది నవంబరు 29న ఇచ్చిన ఇదే తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓక్‌, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌తో కూడిన ధర్మాసనం కొట్టివేస్తూ గత తీర్పులో ఎలాంటి లోపాలు లేవని పునరుద్ఘాటించింది. పునఃసమీక్ష కోరే గడువు ముగిసిపోయిందని కూడా తెలిపింది. నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ)లోని సెక్షన్‌ 3 కింద నేరాభియోగాలను ఎదుర్కొంటున్న వ్యక్తిని నిర్దిష్ట నేరారోపణ కిందే నిందితుడిగా చూపాల్సి ఉంటుందని తెలిపింది. నేరపూరిత కుట్రకు పాల్పడిన వారిని శిక్షించడానికి ఐపీసీ సెక్షన్‌ 120బిని వినియోగిస్తారు. దీని పరిధిలోకి వచ్చే నేరాలకు మాత్రమే ఈ సెక్షన్‌కు వర్తింపజేయాలని స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని