ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు

ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ స్పష్టం చేశారు.

Published : 28 Mar 2024 04:38 IST

 అది మనసు నుంచి వివేకంతో రావాలి: భాగవత్‌

ముంబయి: ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ స్పష్టం చేశారు. ‘సామాజిక పరివర్తనానికి పూచీ ఇవ్వడానికి సంస్థలు పలు అంశాలను ఎంచుకోవాలి. నేను కొన్నింటిని లిస్టు చేశా. పోలీసులు వీధుల్లో ఉన్నప్పుడు ప్రవర్తనలో మార్పు వస్తోంది. ఈడీ సోదాలను తప్పించుకోవడానికీ మారుతున్నట్లు కనిపిస్తోంది. అలాంటివి మనకు అవసరం లేదు. ప్రవర్తనలో మార్పు మన మైండ్‌లో నుంచి రావాలి’ అని ఆయన పేర్కొన్నారు. ముంబయిలో బుధవారం జరిగిన లోకమాన్య సేవా సంఘ్‌ 101వ వార్షికోత్సవంలో భాగవత్‌ మాట్లాడారు. సమాజంలో సంస్కరణలు తేవడంలో ప్రతి సంస్థకూ బాధ్యత ఉందని స్పష్టం చేశారు. భద్రత లేని దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందబోదని తెలిపారు. ‘చొరబాట్లు ఉన్నప్పుడు దేశం అభివృద్ధి చెందలేదు. భద్రత ఉన్నప్పుడే అభివృద్ధి చెందింది. మనం మరింత స్వయం సమృద్ధి సాధిస్తే దేశం మరింత భద్రంగా ఉంటుంది. గీత దాటకుండా కనీస నిబంధనలను ప్రజలు పాటిస్తే దేశం భద్రంగా తయారవుతుంది. ఎవరికో ఇవ్వడానికి ఇది కాంట్రాక్టు కాదు. ప్రతి ఒక్కరి బాధ్యత’ అని భాగవత్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని