రూ.245 కోట్ల డ్రగ్స్‌ స్వాధీనం

మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు.

Published : 28 Mar 2024 04:39 IST

ముంబయి: మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. మెఫేడ్రోన్‌ తయారు చేసే కర్మాగారంపై దాడిచేసి 122.5 కిలోల మత్తుపదార్థాల్ని సీజ్‌ చేశారు. వీటి విలువ దాదాపు రూ.245 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు, మెఫేడ్రోన్‌ తయారీదారు ప్రవీణ్‌ శిందే(34)తో పాటు మొత్తం ఆరుగుర్ని అరెస్టు చేశామన్నారు. పదో తరగతి చదివిన శిందే ఉత్తర్‌ప్రదేశ్‌లో మత్తుపదార్థాల తయారీలో శిక్షణ తీసుకుని ఆరితేరాడు. ఐరాలీ గ్రామంలో ద్రాక్ష తోటలు సరిహద్దులుగా ఉన్న ప్రదేశంలో 12 ఎకరాల భూమి కొనుగోలు చేసి తన అనుచరుల సాయంతో ప్రయోగశాలను ఏర్పాటు చేసి మత్తుపదార్థాల్ని తయారు చేస్తున్నాడు. కిలో డ్రగ్స్‌కు రూ.లక్ష వరకు సంపాదిస్తున్న అతడికి- వాటిని చేరవేసే సొంత యంత్రాంగం ఉంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు నేరుగా కర్మాగారంపై దాడులు నిర్వహించారు. ముడి పదార్థాలు, పనిముట్లను స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని