హుక్కా బార్‌లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్‌బాస్‌ విజేత మునావర్‌ ఫారూకీ

ప్రముఖ స్టాండప్‌ కమెడియన్‌, హిందీ బిగ్‌బాస్‌-17 విజేత మునావర్‌ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు.

Published : 28 Mar 2024 04:44 IST

ముంబయి: ప్రముఖ స్టాండప్‌ కమెడియన్‌, హిందీ బిగ్‌బాస్‌-17 విజేత మునావర్‌ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. ముంబయిలో ఓ హుక్కా బార్‌లో పోలీసులు ఫారూకీని అరెస్టు చేశారు. బోరా బజార్‌ ప్రాంతంలో చట్టవిరుద్ధంగా నడుపుతున్న ఓ హుక్కా బార్‌లో మంగళవారం రాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇవి బుధవారం తెల్లవారుజామున 5 గంటల వరకు కొనసాగాయి. ఈ బార్‌లో ఫారూకీ సహా 14 మంది పొగాకు ఆధారిత హుక్కా పీలుస్తున్న దృశ్యాలు తమ వద్ద ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. నిందితులను అదుపులో తీసుకుని, అనంతరం బెయిల్‌పై విడుదల చేసినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని