ఈడీ విచారణకు మహువా గైర్హాజరు

విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు.

Published : 29 Mar 2024 02:51 IST

కోల్‌కతా: విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. తాను పోటీ చేస్తున్న పశ్చిమబెంగాల్‌లోని కృష్ణానగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో ఆమె మాట్లాడుతూ..‘‘ఈడీ తన పని తాను చేసుకుంటుంది. నా ప్రచారాన్ని నేను కొనసాగిస్తూ..నా పని నేను చేసుకుంటాను’’ అని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని