ఉపాధిహామీ వేతనాల సవరణ

ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి.

Published : 29 Mar 2024 02:52 IST

రాష్ట్రాలవారీగా 4-10% పెంపు

దిల్లీ: ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. సవరించిన లెక్కల ప్రకారం.. నైపుణ్యం లేని కార్మికులకు ఈ పథకం కింద చెల్లించే రోజువారీ వేతనం హరియాణాలో అత్యధికంగా రూ.374గా ఉంది. అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌లలో అత్యల్పంగా రూ.234 ఉన్నట్లు నోటిఫికేషను పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఈసీ నుంచి అనుమతి వచ్చాక.. ఈ వేతనాల సవరణను కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ మార్చి 27న నోటిఫై చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఉపాధిహామీ రోజువారీ వేతనం రూ.28 మేర పెరిగి రూ.300 కానుంది. తమిళనాడులో రూ.319 మేర ఇవ్వనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని