‘అగ్నివీర్‌’లో మార్పులకు సిద్ధం: రాజ్‌నాథ్‌

ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్‌/అగ్నిపథ్‌ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు.

Published : 29 Mar 2024 06:00 IST

దిల్లీ: ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్‌/అగ్నిపథ్‌ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యువతను సాయుధ బలగాల్లో తీసుకుంటున్నారని అన్నారు. అగ్నివీరుల భవిష్యత్తు రక్షణకు తమ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందన్నారు. దిల్లీలో ‘టైమ్స్‌ నౌ’ వార్తా ఛానల్‌ ఏర్పాటు చేసిన సదస్సులో  ఆయన మాట్లాడారు. 

అగ్నివీర్‌ పథకంలో ఏమైనా లోటుపాట్లుంటే వాటిని సరిదిద్దుతామంటూ రాజ్‌నాథ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలు ‘ఎన్నికల గిమ్మిక్కే’ అని కాంగ్రెస్‌ అభివర్ణించింది. ‘ఇండియా’ కూటమి అధికారంలోకి రాగానే తప్పకుండా ఆ పథకాన్ని సమూలంగా మారుస్తామని పునరుద్ఘాటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని