దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ

ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్‌ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది.

Published : 29 Mar 2024 02:53 IST

పన్ను పునఃపరిశీలన ప్రక్రియపై వేసిన పిటిషన్ల కొట్టివేత

దిల్లీ: ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్‌ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. మదింపు ప్రక్రియ చేపట్టేందుకు అవసరమైన ఆధారాలు ఐటీ అధికారుల దగ్గర ఉన్నాయని, ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ, జస్టిస్‌ పురుషేంద్ర కుమార్‌ కౌరవ్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. గత వారం 2014-15 నుంచి 2016-17 మధ్య కాలానికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ చేపట్టిన పునఃపరిశీలనను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కూడా ఇవే కారణాలతో దిల్లీ హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. తాము ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని, తమ దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం రూ.520 కోట్లకు పైగా తేడాలు ఉన్నాయని ఐటీ విభాగం తన వాదనల్లో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని