గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్‌, రాజకీయవేత్త ముఖ్తార్‌ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ సునీల్‌ కౌశల్‌ ప్రకటించారు.

Published : 29 Mar 2024 05:48 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లో 144 సెక్షన్‌

బాందా, లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్‌, రాజకీయవేత్త ముఖ్తార్‌ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ సునీల్‌ కౌశల్‌ ప్రకటించారు. ఆరోగ్యం క్షీణించి వాంతులు చేసుకుంటున్న కారణంగా ముఖ్తార్‌ను బాందా జిల్లా జైలు నుంచి భారీ బందోబస్తు మధ్య రాత్రి 8.25కు ఆసుపత్రికి తీసుకువచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయన చికిత్స పొందుతూ కాసేపటికి మృతిచెందారు. రెండు రోజుల కిందట మంగళవారం కూడా రోజంతా ఆయనకు ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చిన ముఖ్తార్‌ సోదరుడైన గాజీపుర్‌ ఎంపీ అఫ్జల్‌ అన్సారీ తన సోదరుడికి జైలులో ‘స్లో పాయిజన్‌’ ఇస్తున్నారని ఆరోపణలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని