టికెట్‌ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత

ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్‌ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్‌ ఎంపీ, ఎండీఎంకే సీనియర్‌ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు.

Published : 29 Mar 2024 05:48 IST

విల్లివాక్కం, కోయంబత్తూరు-న్యూస్‌టుడే: ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్‌ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్‌ ఎంపీ, ఎండీఎంకే సీనియర్‌ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. ఈసారి పార్టీ టికెట్‌ కేటాయించక పోవడంతో కుంగుబాటుకు గురైన ఆయన విషం తీసుకున్నారు. ఆయన్ను కాపాడేందుకు వైద్యులు శ్రమించినా ఫలితం లేకపోయింది. గణేశమూర్తి 1989లో ఎమ్మెల్యేగా, 1998, 2009, 2019లో ఎంపీగా గెలుపొందారు. నిషేధిత ఎల్టీటీఈకి మద్దతుగా మాట్లాడినందుకు పోటా కింద అరెస్టై జైలుకు వెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని