స్కైరూట్‌ ఏరోస్పేస్‌ రాకెట్‌ స్టేజ్‌-2 పరీక్ష విజయవంతం

హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ సంస్థ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ బుధవారం నిర్వహించిన రాకెట్‌ స్టేజ్‌-2 పరీక్ష విజయవంతమైంది.

Updated : 29 Mar 2024 06:27 IST

శ్రీహరికోట, న్యూస్‌టుడే: హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ సంస్థ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ బుధవారం నిర్వహించిన రాకెట్‌ స్టేజ్‌-2 పరీక్ష విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌) వేదికగా ఈ ప్రయోగం నిర్వహించినట్లు ఆ సంస్థ గురువారం ప్రకటించింది. షార్‌లోని ప్రొపల్షన్‌ టెస్ట్‌బెడ్‌ వద్ద 85 సెకన్ల పాటు నిర్వహించిన ఈ పరీక్షలో రాకెట్‌ ఇంజిన్‌ 186 కిలోన్యూటన్‌ల థ్రస్ట్‌ను విడుదల చేసినట్లు పేర్కొంది. కలాం-250గా వ్యవహరించే ఈ ఇంజిన్‌.. రాకెట్‌ను భూ వాతావరణం నుంచి అంతరిక్షంలోకి తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరించనుందని ప్రకటనలో వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని