కస్టోడియల్‌ మృతి కేసుల్లో.. పోలీసులకు బెయిల్‌ విషయంలో కఠినంగా వ్యవహరించాలి: సుప్రీం

కస్టోడియల్‌ మరణాల కేసులో పోలీసు అధికారులకు బెయిలిచ్చే విషయంలో న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది.

Published : 29 Mar 2024 04:41 IST

దిల్లీ: కస్టోడియల్‌ మరణాల కేసులో పోలీసు అధికారులకు బెయిలిచ్చే విషయంలో న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘‘ఇలాంటి కేసుల్లో పోలీసు వ్యవస్థలోని సభ్యుడి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అందుకే బెయిల్‌ మంజూరు చేసేటపుడు కఠిన వైఖరి తీసుకోవాలి’’ అని జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ ధర్మాసనం పేర్కొంటూ కస్టోడియల్‌ మృతి కేసులో ఓ కానిస్టేబుల్‌కు ట్రయల్‌ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేసింది. సాధారణ పరిస్థితుల్లో తాము రాజ్యాంగంలోని అధికరణం 136 కింద అధికారాలను ఉపయోగించి నిందితుడికి జారీ చేసిన బెయిల్‌ను రద్దు చేయమని..కానీ ఈ కేసు వేరని తెలిపారు. పోలీసు అధికారులు నిందితులుగా ఉన్నారని, ఇలాంటి నేరాలు చాలా తీవ్రమైనవని పేర్కొంది. ఈ కేసులో మృతి చెందిన వ్యక్తిని దొంగతనం కేసులో పోలీసులు 2021 ఫిబ్రవరి 11న కస్టడీలోకి తీసుకున్నారు. ఇందులో మొత్తం 19 మంది పోలీసుల ప్రమేయం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని