అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రవేశాలకు కామన్‌ కౌన్సెలింగుకు యోచన!

మెడికల్‌, ఇంజినీరింగ్‌ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌) మార్కుల ఆధారంగా అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల ప్రవేశాలకు కామన్‌ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Published : 29 Mar 2024 04:42 IST

మెడికల్‌, ఇంజినీరింగ్‌ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌) మార్కుల ఆధారంగా అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల ప్రవేశాలకు కామన్‌ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఆలోచనకు కార్యరూపం ఇచ్చే కసరత్తు కోసం వివిధ విశ్వవిద్యాలయాల అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. పైలట్‌ ప్రాజెక్టుగా దీన్ని అమలుచేసేందుకు అయిదు ప్రముఖ విశ్వవిద్యాలయాలను సైతం ఎంపిక చేశారు. కమిటీ దీనికి అంగీకారం తెలిపితే పై ఆలోచన ఎప్పటినుంచి అమలులోకి వస్తుందనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ‘‘ఇందులోని సాదక బాధకాలను కమిటీ అధ్యయనం చేయాల్సి ఉంది. ఇది అమలులోకి వస్తే విద్యార్థులు విడివిడిగా పలు విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకునే బదులు ఒకే పోర్టల్‌ ద్వారా సింగిల్‌విండో ప్రవేశాలు పొందవచ్చు’’ అని యూజీసీ వర్గాలు తెలిపాయి. దీనిపై వ్యాఖ్యానించేందుకు యూజీసీ ఛైర్మన్‌ ఎం.జగదీశ్‌కుమార్‌ నిరాకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని