ఈస్టర్‌ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్‌ ప్రభుత్వం

ఈస్టర్‌ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్‌ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది.

Published : 29 Mar 2024 05:32 IST

ఇంఫాల్‌: ఈస్టర్‌ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్‌ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. ఆర్థిక సంవత్సరం చివరిరోజులు కావడంతో శని, ఆదివారాలు అయినప్పటికీ ఈ నెల 30, 31 తేదీల్లో అన్ని ప్రభుత్వ శాఖలు విధులు నిర్వహించాలంటూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కాస్తా రాష్ట్రంలో భారీ నిరసనలకు దారి తీసింది. ఈ ఆదేశాలతో క్రైస్తవుల మతపరమైన హక్కులకు భంగం వాటిల్లుతోందంటూ పలు సంఘాలు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించాయి. దీంతో దిగివచ్చిన సర్కార్‌ ఈస్టర్‌ రోజును సెలవుగా ప్రకటించింది. 30న అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు యథావిధిగా విధులు నిర్వహించాలని కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని