ఎలాంటి తప్పూ జరగలేదు

నేషనల్‌ ఏవియేషన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఏసీఐఎల్‌) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది.

Published : 29 Mar 2024 05:33 IST

ఎయిరిండియా లీజు వ్యవహారంపై సీబీఐ
ప్రఫుల్‌ పటేల్‌కు క్లీన్‌చిట్‌

దిల్లీ: నేషనల్‌ ఏవియేషన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఏసీఐఎల్‌) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి పౌర విమానయానశాఖ మంత్రి ప్రఫుల్‌ పటేల్‌తోపాటు, ఆ శాఖకు సంబంధించిన ముఖ్య అధికారులకు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఈ మేరకు కేసు మూసివేతపై తుది నివేదికను సీబీఐ సమర్పించినట్లు అధికారులు గురువారం వెల్లడించారు. ఎయిరిండియా, ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విలీనం యూపీఏ హయాంలో జరిగింది. ఆ సమయంలోనే ఎన్‌ఏసీఐఎల్‌ ఏర్పడింది. 2006లో 4 బోయింగ్‌ 777 విమానాల కోసం లీజు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో అవకతవకలు జరిగాయన్న అభియోగాలపై సుప్రీంకోర్టు ఆదేశాలతో 2017లో సీబీఐ రంగంలోకి దిగింది. ప్రస్తుతం ప్రఫుల్‌ పటేల్‌ ఎన్సీపీ (అజిత్‌ పవార్‌) వర్గంలో ఉన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ప్రఫుల్‌ పటేల్‌ బరిలోకి దిగుతారని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజా పరిణామాలు చర్చనీయాంశమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని