చెరువులో ఈతకు పోతే.. గొంతులో చేప ఇరుక్కొంది!

ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గీర్‌ చాంపా జిల్లాలో పద్నాలుగేళ్ల బాలుడి గొంతులో చేప ఇరుక్కుపోయింది.

Updated : 30 Mar 2024 07:08 IST

ఈటీవీ భారత్‌: ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గీర్‌ చాంపా జిల్లాలో పద్నాలుగేళ్ల బాలుడి గొంతులో చేప ఇరుక్కుపోయింది. చెరువులో ఈత కొడుతున్న అతడి నోటిలోకి అనూహ్యంగా దూరిన చిన్నచేప గొంతులో అడ్డంగా చిక్కుకుపోయింది. సతమతం అవుతున్న బాలుడి నోటిలో నుంచి చేపను బయటకుతీసేందుకు విఫలయత్నం చేసిన స్థానికులు అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. జిల్లాలోని అకల్తరా పోలీస్‌స్టేషను పరిధి కరుమహు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకొంది. శుక్రవారం ఉదయం చెరువుకు వెళ్లిన సమీర్‌ గోడ్‌ (14)కు ఆ వింత అనుభవం ఎదురైంది. అకల్తరా కమ్యూనిటీ హెల్త్‌సెంటరు వైద్యులు అతికష్టం మీద సగం చేపను బయటకు తీశారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బిలాస్‌పుర్‌కు తరలించారు. ముందస్తు సమాచారంతో సిద్ధంగా ఉన్న అక్కడి వైద్యులు సమీర్‌ మెడ దగ్గర చిన్న రంధ్రం చేసి మిగతా చేపను విజయవంతంగా బయటకు తీశారు. బాలుణ్ని పరిశీలనలో ఉంచినట్లు డాక్టర్‌ రామకృష్ణ కశ్యప్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని