ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1 వరకూ ఎగ్జిట్‌ పోల్స్‌కు అనుమతి లేదు.. ఈసీ

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎగ్జిట్‌ పోల్స్‌కు సంబంధించి ఎన్నికల సంఘం(ఈసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది.

Published : 30 Mar 2024 06:03 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎగ్జిట్‌ పోల్స్‌కు సంబంధించి ఎన్నికల సంఘం(ఈసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. తొలి దశ పోలింగ్‌ జరిగే ఏప్రిల్‌ 19వ తేదీ ఉదయం 7 గంటల నుంచి చివరి దశ పోలింగ్‌ రోజు అయిన జూన్‌ 1 సాయంత్రం 6.30 గంటల వరకూ ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహణ, ప్రసారం, ప్రచురణ చేపట్టకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అలాగే పోలింగ్‌ ముగియడానికి 48 గంటల ముందు నుంచి ఎలక్ట్రానిక్‌ మీడియాలో ఫలితాల గురించి అంచనాలతోపాటు ఇతర ఎలాంటి సర్వేలనూ ప్రసారం చేయకూడదని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని