త్వరలో దిల్లీ సీఎంగా ‘మేడం’

ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు కేజ్రీవాల్‌కు చాలా తక్కువ సమయమే ఉందని, అందుకే ఆ స్థానంలో భార్య సునీతను కూర్చోబెట్టేందుకు సిద్ధమవుతున్నారని కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరి వ్యాఖ్యానించారు.

Published : 30 Mar 2024 03:58 IST

కేంద్రమంత్రి హర్‌దీప్‌ సింగ్‌

దిల్లీ: ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు కేజ్రీవాల్‌కు చాలా తక్కువ సమయమే ఉందని, అందుకే ఆ స్థానంలో భార్య సునీతను కూర్చోబెట్టేందుకు సిద్ధమవుతున్నారని కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరి వ్యాఖ్యానించారు. పార్టీలోని ముఖ్య నేతలందర్నీ పక్కకు నెట్టి త్వరలోనే ఆమె సీఎం కుర్చీని అధిరోహిస్తారన్నారు.   ‘‘మేడం కీలక పదవి చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని