కిచిడీ కుంభకోణంలో శివసేన (యూబీటీ) నేతకు ఈడీ సమన్లు

కిచిడీ కుంభకోణంలో శివసేన (యూబీటీ) నేత, లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి అమోల్‌ కీర్తికర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) శుక్రవారం మరోసారి సమన్లు జారీ చేసింది.

Published : 30 Mar 2024 05:14 IST

ముంబయి: కిచిడీ కుంభకోణంలో శివసేన (యూబీటీ) నేత, లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి అమోల్‌ కీర్తికర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) శుక్రవారం మరోసారి సమన్లు జారీ చేసింది. ఏప్రిల్‌ 8న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈడీ తొలుత ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని అమోల్‌కు సమన్లు పంపింది. అయితే అదేరోజు ఆయనకు శివసేన (యూబీటీ) పార్టీ లోక్‌సభ సీటు కేటాయించడంతో విచారణకు హాజరయ్యేందుకు మరింత సమయం కావాలని అమోల్‌ తరఫు న్యాయవాది కోరారు. కొవిడ్‌-19 సమయంలో వలస కూలీలకు కిచిడీ పంపిణీకి సంబంధించిన కాôట్రాక్టులో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అమోల్‌పై మనీ లాండరింగ్‌ కేసు నమోదైంది. ఈ ఏడాది జనవరిలో శివసేన (యూబీటీ) నేత సూరజ్‌ చౌహాన్‌ను కూడా ఈడీ ఇదే కేసులో అరెస్టు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని