టెలికాం శాఖ పేరుతో కాల్స్‌ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!

మొబైల్‌ యూజర్లకు కేంద్ర టెలి కమ్యూనికేషన్‌ విభాగం(డీఓటీ) శుక్రవారం ఓ అడ్వైజరీ జారీచేసింది.

Published : 30 Mar 2024 05:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మొబైల్‌ యూజర్లకు కేంద్ర టెలి కమ్యూనికేషన్‌ విభాగం(డీఓటీ) శుక్రవారం ఓ అడ్వైజరీ జారీచేసింది. తమ శాఖ పేరుతో వచ్చే కాల్స్‌ను నమ్మవద్దని పేర్కొంది. విదేశీ మొబైల్‌ నంబర్ల నుంచి నేరగాళ్లు వాట్సప్‌ కాల్స్‌ చేసి.. మొబైల్‌ నంబరును నిలిపివేస్తామంటూ బెదిరిస్తున్నారని వీటిని ప్రజలు నమ్మవద్దని తెలిపింది. యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్నారని వివరించింది. వీటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఆ కాల్స్‌ వచ్చినప్పుడు ఎలాంటి సమాచారాన్ని పంచుకోవద్దని, వెంటనే సంచార్‌ సాథీ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించింది. ఇదే వెబ్‌సైట్‌లోని ‘నో యువర్‌ మొబైల్‌ కనెక్షన్‌’ అనే ఆప్షన్‌కు వెళ్లి యూజర్లు తమ కనెక్షన్ల గురించి తెలుసుకోవచ్చని తెలిపింది. అప్పటకీ ఈ సైబర్‌ మోసాల బారిన పడితే.. 1930 హెల్ప్‌లైన్‌ నంబరుకు ఫోన్‌ చేసి లేదా సైబర్‌ క్రైమ్‌ వెబ్‌సైట్‌లో రిపోర్ట్‌ చేయాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని