అటు ప్రసవం.. ఇటు శివస్తోత్రం

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో తొలిసారిగా ఓ నవజాత శిశువు తన నానమ్మ పాడుతున్న శివ భజనలు వింటూ తల్లి గర్భం నుంచి బయటికొచ్చాడు.

Published : 30 Mar 2024 05:48 IST

 ఆపరేషన్‌ థియేటర్‌లో అత్తగారి శివభజన

ఈటీవీ భారత్‌: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో తొలిసారిగా ఓ నవజాత శిశువు తన నానమ్మ పాడుతున్న శివ భజనలు వింటూ తల్లి గర్భం నుంచి బయటికొచ్చాడు. ఆపరేషన్‌ థియేటరులో ఓవైపు అత్త భజనలు ఆలపిస్తుండగా.. మరోవైపు వైద్యులు ఆమె కోడలికి ప్రసవం చేశారు. ఉజ్జయినిలోని మంఛామన్‌ కాలనీకి చెందిన ఉపాసనా దీక్షిత్‌కు మార్చి 27న ప్రసవ నొప్పులు వచ్చాయి. ఆ తర్వాత అకస్మాత్తుగా ఆమె పరిస్థితి విషమించడంతో అత్త ప్రీతి దీక్షిత్‌ కోడలిని ఆసుపత్రికి తరలించారు. తీవ్ర ఆందోళనకు గురైన ఉపాసన తన అత్తయ్యను ఆపరేషన్‌ థియేటరులోకి అనుమతించమని వైద్యులను కోరింది. లోపలికి వచ్చిన అత్త ప్రీతిని శివ భజన చేయమని కోడలు చెప్పింది. ఇందుకు వైద్యులు కూడా అంగీకరించడంతో ప్రీతి శివ భజనలు పాడటం మొదలుపెట్టారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా 20 నిమిషాల్లో ఉపాసన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. థియేటరులో ప్రీతి భజనలు చేస్తున్న వీడియోను వైద్యులు సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా వైరల్‌గా మారింది. ‘‘ప్రీతి తన భజనలతో సానుకూల వాతావరణం సృష్టించారు. భజనలు విని రిలాక్స్‌ అవుతూ మేము ఆపరేషను చేశాం’’ అని డాక్టర్‌ జయమిశ్ర తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని