హిమాలయాల్లో భారీ ప్రాజెక్టులను నిషేధించాలి

హిమాలయాల్లో పలు భారీ ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిషేధించాలని కోరుతూ 60కి పైగా పర్యావరణ, సామాజిక సంస్థలు డిమాండ్‌ చేశాయి.

Updated : 31 Mar 2024 06:01 IST

పర్యావరణ సంస్థల డిమాండ్‌
దిల్లీ: హిమాలయాల్లో పలు భారీ ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిషేధించాలని కోరుతూ 60కి పైగా పర్యావరణ, సామాజిక సంస్థలు డిమాండ్‌ చేశాయి. ఈ ప్రాంతంలో డ్యాంలు, రైల్వేలు, హైడ్రో ప్రాజెక్టులు, నాలుగు లైన్ల రహదారుల మెగా నిర్మాణాలను చేపట్టే ముందు ప్రజాభిప్రాయాన్ని తప్పకుండా సేకరించాలని విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు 5 పాయింట్ల చార్టర్‌ను విడుదల చేశాయి.


ప్రత్యేక రాష్ట్రంపై హామీ ఇవ్వాల్సిందే.. లేదంటే ఎన్నికలు బహిష్కరిస్తాం: ఈఎన్‌పీవో

కోహిమా: నాగాలాండ్‌లోని ఆరు జిల్లాలతో ఓ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్న ‘ది ఈస్ట్రన్‌ నాగాలాండ్‌ పీపుల్స్‌ ఆర్గనైజేషన్‌’ (ఈఎన్‌పీవో) లోక్‌సభ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించింది. కేంద్రం నుంచి స్పష్టమైన హామీ వచ్చేంత వరకు రాష్ట్రంలోని ఏకైక లోక్‌సభ స్థానంలో ఎన్నికలకు సహకరించబోమని స్పష్టం చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని