బహిరంగ ప్రదేశాల్లో యూఎస్‌బీతో ఛార్జింగ్‌ వద్దు

బహిరంగ ప్రదేశాల్లోని యూఎస్‌బీ ఛార్జింగ్‌ పాయింట్ల సాయంతో మొబైల్‌ ఫోన్ల ఛార్జింగ్‌ చేయొద్దని కేంద్రం తరఫున ‘కంప్యూటర్‌ అత్యవసర స్పందన బృందం’ (సీఈఆర్‌టీ-ఇన్‌) హెచ్చరిక జారీ చేసింది.

Updated : 31 Mar 2024 03:23 IST

సైబర్‌ దాడులకు అవకాశం: కేంద్రం

దిల్లీ: బహిరంగ ప్రదేశాల్లోని యూఎస్‌బీ ఛార్జింగ్‌ పాయింట్ల సాయంతో మొబైల్‌ ఫోన్ల ఛార్జింగ్‌ చేయొద్దని కేంద్రం తరఫున ‘కంప్యూటర్‌ అత్యవసర స్పందన బృందం’ (సీఈఆర్‌టీ-ఇన్‌) హెచ్చరిక జారీ చేసింది. బస్టాండ్లు, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటుచేసిన యూఎస్‌బీ ఛార్జింగ్‌ స్టేషన్లు ఆసరాగా చేసుకొని కొందరు నేరగాళ్లు సైబర్‌ దాడులకు పాల్పడుతున్నారు. వినియోగదారుల వ్యక్తిగత డేటాను దొంగిలించడానికి, లేదా వారి పరికరాల్లో మాల్వేర్‌ను జొప్పించడానికి ఛార్జింగ్‌   పోర్ట్స్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఈ తరహా దాడులనే ‘జ్యూస్‌ జాకింగ్‌’ అంటారు. వీటితో జాగ్రత్త వహించాలని సీఈఆర్‌టీ సూచించింది. ఇకపై బయటకు వెళ్లినప్పుడు ‘ఎలక్ట్రికల్‌ వాల్‌ అవుట్‌లెట్‌’ను మాత్రమే ఎంచుకోవాలని, లేదా కేబుల్స్‌, పవర్‌ బ్యాంకులను తీసుకెళ్లాలని తెలిపింది. సైబర్‌ దాడి జరిగితే www.cybercrime.gov.inలో గానీ, 1930 హెల్ప్‌లైన్‌ ద్వారా గానీ ఫిర్యాదు చేయాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని