రైలు పట్టాలపై హై వోల్టేజ్‌ వైర్‌

లోకోపైలట్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించి వేలమంది ప్రాణాలను కాపాడారు. రైలు పట్టాలపై హై వోల్టేజ్‌ విద్యుత్‌ తీగను గమనించి అత్యవసరంగా రైలును నిలిపివేశారు.

Updated : 31 Mar 2024 03:25 IST

లోకోపైలట్‌ అప్రమత్తతతో యశ్వంత్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

తుముకూరు: లోకోపైలట్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించి వేలమంది ప్రాణాలను కాపాడారు. రైలు పట్టాలపై హై వోల్టేజ్‌ విద్యుత్‌ తీగను గమనించి అత్యవసరంగా రైలును నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన కర్ణాటకలోని తుముకూరు జిల్లా కుణిగల్‌ పట్టణ శివారులో జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇదీ జరిగింది..

ప్రయాణికులతో యశ్వంత్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌ బెంగళూరు నుంచి హాసన్‌కు శుక్రవారం ఉదయం బయలుదేరింది. మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో కుణిగల్‌ పట్టణ సమీపంలో రైల్వే ట్రాక్‌పై హై వోల్టేజ్‌ విద్యుత్‌ లైన్‌ పడి ఉంది. దాన్ని గమనించిన లోకోపైలట్‌ రైలును నిలిపివేశారు. ఆయన సమయస్ఫూర్తిని ప్రయాణికులు అభినందించారు. అనంతరం రైల్వే అధికారులకు సమాచారం అందించడంతో.. బెంగళూరు నుంచి వచ్చిన రైల్వే సాంకేతిక సిబ్బంది విద్యుత్‌ తీగను తీసేశారు. మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో రైలు హాసన్‌ వైపు బయలుదేరిందని రైల్వే వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని