సముద్రపు దొంగల ఆటకట్టించిన భారత్‌

భారత నౌకాదళం మరోసారి సముద్రపు దొంగల ఆటకట్టించింది. అరేబియా సముద్రంలో హైజాక్‌కు గురైన ఇరాన్‌కు చెందిన చేపల పడవను రక్షించింది.

Published : 31 Mar 2024 03:25 IST

23 మంది పాకిస్థానీయులను రక్షించిన నౌకాదళ సిబ్బంది

దిల్లీ: భారత నౌకాదళం మరోసారి సముద్రపు దొంగల ఆటకట్టించింది. అరేబియా సముద్రంలో హైజాక్‌కు గురైన ఇరాన్‌కు చెందిన చేపల పడవను రక్షించింది. 12 గంటల పాటు సాగిన ప్రత్యేక ఆపరేషన్‌ ద్వారా పడవలోని 23 మంది పాకిస్థానీ సిబ్బందిని సురక్షితంగా కాపాడినట్లు అధికారులు ప్రకటించారు. గల్ఫ్‌ ఆఫ్‌   ఎడెన్‌కు సమీపంలో ఉన్న సోకోట్రా ద్వీప సమూహానికి 90 నాటికల్‌ మైళ్ల దూరంలో గురువారం ఇరాన్‌కు చెందిన చేపల పడవ ‘కంబార్‌’ను తొమ్మిది మంది సముద్రపు దొంగలు ఆధీనంలోకి తీసుకున్నారు. రంగంలోకి దిగిన భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ సుమేధా ముందుగా కంబార్‌ను అడ్డుకుంది. ఐఎన్‌ఎస్‌ త్రిశూల్‌ సాయంతో దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అందులోని 9 మంది దొంగలను భారత్‌కు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని