కాంబోడియాలో చిక్కిన 250 మందిని కాపాడాం

ఉపాధి అవకాశాల ఆశతో కాంబోడియాకు వెళ్లి, గత్యంతరం లేక బలవంతంగా సైబర్‌ నేరాల పనుల్లో చిక్కుకొన్న 250 మంది భారతీయులను ఇప్పటిదాకా సురక్షితంగా వెనక్కు తీసుకువచ్చినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.

Published : 31 Mar 2024 04:33 IST

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

దిల్లీ: ఉపాధి అవకాశాల ఆశతో కాంబోడియాకు వెళ్లి, గత్యంతరం లేక బలవంతంగా సైబర్‌ నేరాల పనుల్లో చిక్కుకొన్న 250 మంది భారతీయులను ఇప్పటిదాకా సురక్షితంగా వెనక్కు తీసుకువచ్చినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. మీడియా కథనాల ఆధారంగా విషయాన్ని గ్రహించి, కాంబోడియా అధికారుల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించింది. కాంబోడియాలోని భారత రాయబార కార్యాలయానికి సైతం దీనిపై పలు ఫిర్యాదులు అందినట్లుగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ తెలిపారు. ఇటువంటి మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలంటూ మంత్రిత్వ శాఖ తరఫున పలు సూచనలు కూడా జారీ చేశామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు