సుస్థిర ప్రగతి ముఖ్యం: జస్టిస్‌ హిమా కోహ్లి

ఆర్థిక శ్రేయస్సు, వ్యక్తిగత హక్కులు రెండూ ముఖ్యమేననీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి పేర్కొన్నారు.

Published : 31 Mar 2024 04:34 IST

దిల్లీ: ఆర్థిక శ్రేయస్సు, వ్యక్తిగత హక్కులు రెండూ ముఖ్యమేననీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి పేర్కొన్నారు. ఆర్థికాభివృద్ధి అంటే తక్షణ లాభాలు మాత్రమే కావనీ, సుస్థిరంగా ప్రగతి పంథాలో పురోగమించడమని ఆమె ఉద్ఘాటించారు. అమెరికా బార్‌ అసోసియేషన్‌-ఇండియా 2024 సదస్సులో ఆమె ప్రసంగించారు. పర్యావరణ సంరక్షణ, సాంఘిక సంక్షేమం, సుస్థిరాభివృద్ధి సూత్రాలను మేళవించడం ద్వారానే దీర్ఘకాలిక ఆర్థిక ప్రగతిని సాధించగలమని భారత న్యాయవ్యవస్థ విశ్వసిస్తోందని చెప్పారు. ఆర్థిక శ్రేయస్సు, వ్యక్తిగత హక్కుల మధ్య సమతుల్యత సాధించినప్పుడే సుసంపన్నమైన, న్యాయమైన, సమ్మిళిత సమాజాన్ని సాధించగలమని తెలిపారు. భారత్‌, అమెరికాలు రెండూ న్యాయపాలనపై నమ్మకం ఉంచుతున్నాయనీ, ఆర్థికాభివృద్ధి సాధనలో ఇది ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. వివాదాల సత్వర పరిష్కారం, ఆస్తి హక్కుల రక్షణ, ఒప్పందాలను సక్రమంగా నెరవేర్చడం, డిజిటల్‌ రూపాంతరీకరణ ద్వారా రెండు దేశాలూ నవీకరణను, ఆర్థిక ప్రగతిని సాధించగలవన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని