సుప్రీం తీర్పునకు 3 రోజుల ముందే.. 10,000 బాండ్ల ముద్రణకు అనుమతి

రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని ఫిబ్రవరి 15న సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.

Published : 31 Mar 2024 04:34 IST

దిల్లీ: రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని ఫిబ్రవరి 15న సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే.. అంతకు మూడు రోజుల క్రితమే 10 వేల ఎలక్టోరల్‌ బాండ్ల ముద్రణకు సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఎస్‌పీఎంసీఐఎల్‌)కు ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఆ బాండ్ల విలువ ఒక్కోటి రూ.కోటి ఉన్నట్లు ఆర్టీఐ వివరాల్లో ఉందని ఓ వార్తాసంస్థ తెలిపింది. సుప్రీం తీర్పు అనంతరం ఆ బాండ్ల ముద్రణను నిలిపేయాలంటూ ఫిబ్రవరి 28న ఆర్థికశాఖ మరోసారి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. అయితే.. ఎస్‌పీఎంసీఐఎల్‌ అప్పటికే 8,350 బాండ్లను ముద్రించి, ఎస్‌బీఐకి చేర వేసినట్లు వెల్లడైంది. ఆర్థిక శాఖ, ఎస్‌బీఐల మధ్య ఈ-మెయిల్‌ వంటి సంప్రదింపుల వివరాల ద్వారా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు వార్తాసంస్థ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని