ఇంటి అద్దె రూ.కోటి!.. తప్పుడు వివరాలతో పన్ను లబ్ధికి యత్నం

ఇంటి అద్దె రూపంలో ఒక ఏడాదిలో రూ.కోటి చెల్లించానని ఓ ఉద్యోగి తన ఆదాయపు పన్ను రిటర్న్స్‌లో చూపించాడు..!

Updated : 31 Mar 2024 08:07 IST

దిల్లీ: ఇంటి అద్దె రూపంలో ఒక ఏడాదిలో రూ.కోటి చెల్లించానని ఓ ఉద్యోగి తన ఆదాయపు పన్ను రిటర్న్స్‌లో చూపించాడు..! తన యజమాని పాన్‌నూ ఉటంకించాడు. అనుమానం వచ్చిన ఐటీ శాఖ ఆరా తీస్తే అదంతా అబద్ధమని తేలింది. పాన్‌ ఆధారంగా ‘యజమాని’ని ప్రశ్నిస్తే తనకు అంత ఆదాయమే లేదని కళ్లు తేలేయడంతో ఇది బోగస్‌ అని బయటపడింది. దీంతో ఇలాంటివారు ఎందరున్నారో ఆరా తీయడంలో అధికార వర్గాలు నిమగ్నమయ్యాయి. అద్దె ఇంట్లో నివసించనప్పటికీ.. కేవలం పన్ను నుంచి తప్పించుకునేందుకు ఇతరుల పాన్‌ కార్డులను అనధికారికంగా ఉపయోగించినవారు దాదాపు 10వేల మంది వరకు ఉంటారని భావిస్తున్నారు. వీరంతా రూ.10 లక్షల పైబడి అద్దెలు చెల్లించినట్లు చూపించారు. ఒకే పాన్‌ను అనేకమంది పేర్కొనడం విశేషం. ఇలాంటివాటిపై ఇప్పుడు నిశిత పరిశీలన మొదలైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని