ఫ్లైఓవర్‌పై కారు ఆపి రీల్స్‌.. యూట్యూబర్‌ అరెస్టు

దేశరాజధాని దిల్లీలో రద్దీగా ఉన్న వంతెనపై విన్యాసాలు చేసిన ఓ యూట్యూబర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Published : 01 Apr 2024 05:26 IST

రూ.36వేలు జరిమానా

దిల్లీ: దేశరాజధాని దిల్లీలో రద్దీగా ఉన్న వంతెనపై విన్యాసాలు చేసిన ఓ యూట్యూబర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పలు సెక్షన్లతోపాటు రూ.36వేల జరిమానా విధించినట్లుగా పోలీసులు ప్రకటించారు. వివరాల్లోకి వెళ్తే...ప్రదీప్‌ ఢాకా (25) యూట్యూబర్‌.. శనివారం పశ్చిమ్‌ విహార్‌లోని ఓ ఫ్లైఓవర్‌పై తన ఎస్‌యూవీ కారును ఆపి రీల్స్‌ చేయడం మొదలుపెట్టారు. వీటికోసం సమీపంలºని పోలీస్‌ బారికేడ్‌కు నిప్పంటించాడు కూడా. అంతటితో ఆగకుండా కారు తలుపులు తెరిచి ప్రయాణించాడు. దీంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ఈ వీడియోలను సామాజిక మాధ్యమంలో పోస్ట్‌ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి కారులో ప్లాస్టిక్‌తో తయారు చేసిన కొన్ని నకిలీ ఆయుధాలు కూడా లభ్యమయ్యాయి. గతంలోనూ అతడు అధికారులతో దురుసుగా ప్రవర్తించినట్లు విచారణలో తేలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని