గ్యాంగ్‌స్టర్‌ బంధువుల ఆస్తుల జప్తు

గ్యాంగ్‌స్టర్‌ సురేందర్‌ సింగ్‌ అలియాస్‌ చిక్కు బంధువులకు చెందిన రూ.17.82 కోట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తు చేసింది.

Published : 01 Apr 2024 05:27 IST

దిల్లీ: గ్యాంగ్‌స్టర్‌ సురేందర్‌ సింగ్‌ అలియాస్‌ చిక్కు బంధువులకు చెందిన రూ.17.82 కోట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తు చేసింది. లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు చెందిన ఈ ఆస్తులను చిక్కు బంధువులు నిర్వహిస్తున్నారు. మనీ లాండరింగ్‌ కేసులో జప్తు చేసిన స్థిరాస్తులు హరియాణాలోని నార్నౌల్‌, రాజస్థాన్‌లోని జైపుర్‌లలో ఉన్నాయి. తిహాడ్‌ జైలులో ఉన్న చిక్కు.. లారెన్స్‌కు చెందిన ఆస్తులను నిర్వహించేవాడు. అతడు బంధువులు, స్నేహితుల పేర్లతో మరిన్ని ఆస్తులను కొనుగోలు చేశాడు. తన బావమరిది వికాస్‌ కుమార్‌ డైరెక్టరుగా నిమావత్‌ గ్రానైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీని చిక్కు పెట్టాడు. నార్నౌల్‌లోని మైనింగ్‌ కంపెనీని తీసుకున్నాడు. ఎటువంటి పెట్టుబడులు పెట్టకుండానే వారిద్దరు రూ.2.84 కోట్లను తరలించారు. దీనిపై ఈడీ కేసు నమోదు చేసింది. ఫిబ్రవరిలో చిక్కును అరెస్టు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని